మలయాళ మిస్టరీ థ్రిల్లర్స్ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అవడమే కాదు ఓటీటీ లోను బిగ్గెట్స్ హిట్స్ గా నిలుస్తున్నాయి. మలయాళంలో హిట్ అయిన ఏ సినిమాని అయినా పాన్ ఇండియాలోని పలు భాషల ఆడియెన్స్ ఓటీటీలో ఇంట్రెస్టింగ్ గా వీక్షిస్తున్నారు. మలయాళంలో ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రేఖాచిత్రం అక్కడ థియర్స్ లో కోట్లు కొల్లగొట్టడమే కాదు.. ఇక్కడా ఓటీటీలోనూ బిగ్ హిట్ గా నిలిచేంతలా హైప్ క్రియేట్ అయ్యింది. సోని లివ్ ఓటీటీ నుంచి ఈనెల 7 నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చిన రేఖాచిత్రం మినీ సమీక్షలోకి వెళితే..
రేఖ చిత్రం మినీ స్టోరీ
మమ్ముట్టి మీద విపరీతమైన అభిమానంతో సినిమా నటి అవ్వాలనే కోరికతో జూనియర్ ఆర్టిస్ట్ గా మారి మొదటి సినిమా పూర్తి కాకుండానే కనబడకుండా పోయిన రేఖ అనే జూనియర్ ఆర్టిస్ట్ అమ్మాయి కథ.. రేఖాచిత్రం. మిస్టరీ థ్రిల్లర్ అంటే.. ఆ ట్విస్ట్ లు, ఆ సస్పెన్స్ లతో రేఖాచిత్రం స్టోరీని దర్శకుడు జోఫిన్ టి. చాకో రక్తి కట్టించారు.
కన్యాకుమారి నుంచి త్రివేండ్రం చేరుకుని జూనియర్ ఆర్టిస్ట్ గా మారిన రేఖ (అనస్వర రాజన్) హత్యకు గురౌతుంది. స్టోరీ రొటీన్. కానీ దర్శకుడు కథనం నడిపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
రాజేంద్రన్ అనే వ్యక్తి బాధపడుతూ.. అడవిలోకి వెళ్లి తాను మరో ముగ్గురితో కలిసి చేసిన ఓ పాపం గురించి ఫేస్ బుక్ లైవ్ లో చెబుతూ.. వర్షం కురిసిన రాత్రి ఓ అమ్మాయి శవాన్ని పూడ్చిన చోటే తాను సూసైడ్ చేసుకుంటూ మిగతా ముగ్గురు పేర్లు బయటపెట్టడంతో రేఖాచిత్రం కథ ప్రారంభమవుతుంది. ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ వివేక్ (ఆసిఫ్ అలీ) హ్యాండిల్ చెయ్యడం మధ్యలో పై అధికారుల ప్రెజర్ తో కేసుని వదిలేసిన పర్సనల్ గా కేసుని హ్యాండిల్ చేస్తూ అసలు హతకుడిని పట్టుకోవడం అంతా గ్రిప్పింగ్ గా సాగుతుంది.
రేఖ చిత్రం ఎఫర్ట్స్:
వివేక్ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా ఆసిఫ్ అలీ నేచురల్ పెరఫార్మెన్స్ తో అద్దరగొట్టేసారు. అనస్వర రాజన్ రేఖ పాత్రలో అమాయకంగా ఆకట్టుకుంది. మమ్ముట్టి పై అభిమానంతో జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలనే కోరికతో డబ్బు వ్యామోహం గల వ్యక్తుల చేతిలో బలైపోయిన అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. విన్సెంట్ పాత్రలో మనోజ్ కె.జయన్ న్యాయం చేసారు.
నేపధ్య సంగీతం అక్కడక్కడా విన్నట్టుగా ఉన్నప్పటికీ.. కథలో లీనమయ్యాక అవేమి వినిపించవు. ఈ చిత్రంలో వింటేజ్ సెటప్ అన్నీ చక్కగా కుదిరాయి.
రేఖ చిత్రం ఎనాలసిస్
1985లో కాథోడు కాథోరం షూటింగ్ లొకేషన్ లో అనూహ్యంగా మిస్సయిపోయిన అమ్మాయి గురించి 2024 లో పోలీస్ ఆఫీసర్ వివేక్ చేసే ఇన్వెస్టిగేషన్.. ఇలా రెండు రకాలుగా కథనం నడుస్తోంది. సినిమా మొదలు కాగానే అమ్మాయి శవం దొరకడం, దాని గురించి వీవెక్ ఇన్వెస్టిగేషన్, అసలు నేరస్తుడు ఎవరు అనేది రివీల్ చేసినా.. ఎలా, ఎందుకు రేఖను చంపేశారు అనే విషయాన్నిరివీల్ చెయ్యకుండా చివరి వరకు సస్పెన్స్ క్రియేట్ చెయ్యడం అనేది ప్రేక్షకులకు థ్రిల్ అనిపించేలా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ లవర్స్ కు రేఖాచిత్రం పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది.