యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో ఉన్నారు. ఆయన అతి త్వరలోనే ప్రశాంత్ నీల్ తో సెట్స్ లో జాయిన్ అవ్వబోతున్నారు. ఈలోపు ఎన్టీఆర్ ఓ కమర్షియల్ యాడ్ చేసారు. ఆన్ లైన్ సరుకులను డెలివరీ చేసే జెప్టో యాడ్ లో ఎన్టీఆర్ కనిపించారు. ఈమధ్యన ఎన్టీఆర్ 14 కేజీలు తగ్గినట్లుగా చెప్పారు.
అంతేకాదు ఎన్టీఆర్ జిమ్ లుక్ కూడా రీసెంట్ గా వైరల్ అయ్యింది. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహపడ్డారు. కానీ ఇప్పుడు జెప్టో యాడ్ లో ఎన్టీఆర్ లుక్ చూసి చాలామంది నెగెటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హెయిర్ స్టైల్, లుక్స్ గురించి కనిపిస్తున్న కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళ పడుతున్నారు.
యాంటీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై కామెంట్స్ చెయ్యడం కన్నా ఎన్టీఆర్ అభిమానులకే ఎన్టీఆర్ కొత్త లుక్ షాకిచ్చింది. ఫేస్ లో చాలా తేడా కనిపించడం, ఆ హెయిర్ స్టయిల్ ఎన్టీఆర్ కి మ్యాచ్ అవ్వకపోవడం అభిమానుల ఆందోళనకు కారణమైంది. మరి ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ లుక్ పై ఇప్పడు ఫ్యాన్స్ లో అనుమానం మొదలైంది.