ఇప్పుడే నా ప్రయాణం ముగియలేదు.. ఇంకా చాలానే చేయాల్సిన ఉంది అంటోంది స్టార్ హీరోయిన్ సమంత. సినీ ఇండస్ట్రీలో 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆమె ప్రతి ఒక్క అడుగూ ఒక గొప్ప అనుభవంగా ప్రతి మెట్టూ ఒక పోరాటంగా మలుచుకున్నట్లు చెబుతోంది.
సినిమా ప్రపంచంలో అడుగుపెట్టినప్పటి నుంచి విజయం, పరాజయాలను సమానంగా స్వీకరించానని సమంత పేర్కొంది. ఒకసారి గొప్ప విజయం సాధిస్తే చాలా మంది ఆ స్థాయిలోనే తృప్తి చెందుతారు. కానీ నేను అలా కాదు. ప్రతిసారీ కొత్త లక్ష్యాన్ని పెట్టుకుని మరింత ఎదగాలనుకుంటాను. నా విజయాన్ని ఇంకొక మెట్టు ఎక్కే అవకాశం గా తీసుకుంటా. అదే సమయంలో ఓటమిని ఓ మచ్చగా భావించి దాన్ని అధిగమించేందుకు మరింత కృషి చేస్తా అని చెప్పింది సమంత.
సినీ జీవితంలో ఎదురైన అనేక సవాళ్లు తనను మరింత బలంగా మార్చాయని పోరాడితే తప్ప మరెప్పుడూ గెలుపు రాదన్న సత్యాన్ని ప్రతి అనుభవం నేర్పిందని ఆమె అభిప్రాయపడింది. విజయం, పరాజయం రెండూ నాకు సమానమే. అవి నాలో పోరాట తత్వాన్ని పెంపొందించాయి. అదే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిందని నమ్ముతా అంటూ తన విజయ రహస్యాన్ని వెల్లడించింది సమంత.