రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అంటూ లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాధన్ తమిళ్ నుంచి తెలుగు వరకు కోట్లు కొల్లగొట్టుకుపోయాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రానికి యూత్ కనెక్ట్ అవడంతో 100 కోట్ల పోస్టర్ పడింది. దానితో ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ పై అందరిలో క్యూరియాసిటీ మొదలైంది.
ఫిబ్రవరి 21న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రంపై యూత్ లో క్రేజ్ పెరిగిపోయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది. థియేటర్స్ లో హిట్ అయ్యి కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ లోకి దిగేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది. మరి సినిమా రిలీజ్ అయిన ఐదు వారాలకు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఓటీటీ లోకి రాబోతుంటే యూత్ ఊరుకుంటుందా.. అస్సలు ఊరుకోరు.