Advertisementt

పోసానిపై కేసులు - మరీ కామెడీగా తయారైంది

Sat 08th Mar 2025 04:26 PM
posani krishna murali  పోసానిపై కేసులు - మరీ కామెడీగా తయారైంది
Case against Posani - too much comedy పోసానిపై కేసులు - మరీ కామెడీగా తయారైంది
Advertisement
Ads by CJ

నటుడు పోసానిపై ఓబులవారిపల్లె లో కేసు నమోదు కాగా ఆయన్ని ఏపీ పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని పోసాని ఇంట్లోనే అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించగా ఆయనకు రాజాం పేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈలోపు ఏపీలో పోసానిపై పలు కేసులు నమోదు కావడంతో పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకోవడం, కోర్టు రిమాండ్ చెయ్యడం అనేది కామెడీగా తయారైంది. 

నరసారావు పేట పోలీసులు నుంచి ఆదోని పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకోగా, కర్నూలు కోర్టు పోసాని కృష్ణమురళి కి 10 రోజుల రిమాండ్ విధించింది. ఈలోపు రాజాం పేట కేసులో పోసానికి బెయిల్ లభించింది. అంతవరకూ ఓకె. కట్ చేస్తే విజయవాడలో పోసానిపై మరో కేసు నమోదు అయ్యింది. 

విజయవాడ పోలీసులు పోసానిని కర్నూలు నుంచి విజయవాడ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. అంతా చూస్తుంటే ఏపీ పోలీసులు పోసానిని అక్కడ స్టేషన్, ఇక్కడ స్టేషన్ అంటూ తిప్పడం ఆ వయసులో కేసులంటూ కష్ట పెట్టడం అన్ని కామెడీ అయ్యాయి. పోసాని విషయంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయమంటున్నారు నెటిజెన్స్. 

Case against Posani - too much comedy:

Another Case Against Posani Krishna Murali

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ