ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ అభిమానులే కాదు ఏపీ ప్రజలే అంతా వైసీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయిన నేతల అరెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో ఒక్కొక్కరిగా జైలుకు పంపించే ఏర్పాట్లలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికే బోరుగడ్డ అనిల్, వంశీ వల్లభనేని, పోసాని లాంటి వాళ్ళు జైలుకెళ్లారు.
కాని అందరి చూపు కొడాలి నాని పైనే ఉంది. నానిని కూటమి ప్రభుత్వం ఎప్పుడెప్పడు అరెస్ట్ చేస్తుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అది జరిగేట్టుగా కనిపిస్తుంది. కొడాలి నాని అనుచరులపై గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం, లిక్కర్ గౌడౌన్ వ్యవహారంలో బెదిరించిన కేసులు ఉన్నాయి.
కొడాలి నాని ప్రధాన అనుచరులైన వారికి తాజాగా 41ఏ నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ కేసుల్లో అనుచరుల విచారణ తర్వాత కొడాలి నానికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా ఏపీ బెవరేజేస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి , జేసీ మాధవీలత తో పాటుగా నాని కూడా ఈసారి అరెస్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు అంటున్నారు.