Advertisementt

మిల్కీబ్యూటీ బ్రేకప్‌కి కారణం ఇదేనా

Thu 03rd Apr 2025 01:46 PM
tamannaah bhatia  మిల్కీబ్యూటీ బ్రేకప్‌కి కారణం ఇదేనా
Tamannaah Opens Up About Breakup with Vijay Varma, Reveals the Reason మిల్కీబ్యూటీ బ్రేకప్‌కి కారణం ఇదేనా
Advertisement
Ads by CJ

నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్లుగా మిల్కీబ్యూటీ తమన్నా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య బాలీవుడ్‌లో ఏ వేడుకలో చూసినా వీరిద్దరూ జంటగానే కనిపించారు. మరి ఏమైందో ఏమో.. సడెన్‌గా వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిందంటూ వార్తలు వచ్చేశాయి. అంతేనా, తమన్నా కూడా వర్మకి సంబంధించి ఫొటోలన్నింటినీ సోషల్ మీడియా అకౌంట్స్‌లో తొలగించి, ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.

దీంతో, అసలు వీరిద్దరి బ్రేకప్‌కి కారణం ఏమై ఉంటుందా? అని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. వారి బ్రేకప్‌కి కారణం ఏమిటో తమన్నానే ఇన్ డైరెక్ట్‌గా తను పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రేమను ఎప్పుడైతే లావాదేవీగా చూడటం మొదలుపెడతారో, అప్పుడే అసలు సమస్యలు వస్తాయంటూ, ఈ మిల్కీబ్యూటీని వర్మ ఏ విధంగా చూస్తున్నాడో, ఎందుకు బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందో ఇన్ డైరెక్ట్‌గా చెప్పేసింది.

ప్రేమిస్తే వారి భావాలకు స్వేచ్ఛనివ్వాలి. రిలేషన్ షిప్‌లో ఉన్నప్పటి కంటే లేనప్పుడే నేను హ్యాపీగా ఉన్నాను. మనిషికి భాగస్వామి అవసరమే కానీ, ఆ భాగస్వామి ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అని తమన్నా తన లైఫ్ లెసన్‌ని అందరితో షేర్ చేసుకుంది. 

Tamannaah Opens Up About Breakup with Vijay Varma, Reveals the Reason:

Tamannaah Talks About Her Breakup, Says Giving Space in a Relationship is Crucial

Tags:   TAMANNAAH BHATIA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ