సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ గ్లామర్ షో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జాన్వీ కపూర్ బయట కనిపించింది అంటే ఆమె అందాలు ఆరబోతపై స్పెషల్ కన్నేస్తారు యూత్. సినిమాల్లో సాంప్రదాయంగా, నార్మల్ గా కనిపించే జాన్వీ కపూర్ సోషల్ మీడియా ఫోటో షూట్స్ మాత్రం చెలరేగిపోతుంది.
ఇప్పుడు అక్క జాన్వీ కపూర్ కి గట్టి పోటీ ఇస్తుంది చెల్లెలు ఖుషి పాప. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఖుషి కపూర్ గ్లామర్ షో విషయంలో అస్సలు మొహమాటపడడం లేదు. లవ్ యాప సినిమా రిజల్ట్ తో పని లేకుండా ఖుషి కపూర్ సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టేసింది.
తాజాగా పింక్ డ్రెస్ లో ఖుషి కపూర్ ఖుషి ఖుషి గా కనిపించింది. చేతిలో కుక్క పిల్లతో ఖుషి కపూర్ పింక్ కాస్ట్యూమ్ లో క్యూట్ గా కనిపించింది. సింపుల్ లుక్ అయినా బ్యూటిఫుల్ గా ఆకట్టుకుంది.