రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కలయికలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఎంతో కేర్ తీసుకుని రూపొందిస్తున్నారు. ప్రభాస్ వంటి స్టార్ హీరోతో థ్రిల్లర్ కథాంశం చేయడం సాహసమే అయినా ఇందులో ఉన్న కమర్షియల్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు.
సినిమాను 2024 సమ్మర్‌లో విడుదల చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ ప్రస్తుతం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మేకర్స్ ఇంకా కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటి వరకు సినిమా నుంచి టీజర్ విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ప్రభాస్ గ్లింప్స్, మోషన్ పోస్టర్ మాత్రమే విడుదల చేశారు. కానీ ఫుల్ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నా చిత్ర బృందం మాత్రం ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదు.
సోషల్ మీడియాలో రెబల్ స్టార్ అభిమానులు రాజా సాబ్ టీజర్ వదలండి అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. కానీ మారుతి, మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. ఇటీవల ఎక్కడ కనిపించినా రాజా సాబ్ గురించి అడిగినప్పుడు తర్వాత చెప్తా అంటూ మారుతి తప్పించుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఇంత రహస్యంగా సినిమాను ఉంచడం ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచినా చివరకు అంచనాలను అందుకోవడంలో విఫలమైతే మాత్రం అభిమానులు డిజప్పాయింట్ అవ్వాల్సిందే. ఈ మధ్యకాలంలో ప్రమోషన్ కీలకమైన అంశంగా మారింది. రాజమౌళి సినిమాలకు ప్రమోషన్ చేయడంలో అందరికంటే ముందుండగా, అనిల్ రావిపూడి కూడా తన చిత్రాలకు విపరీతంగా ప్రమోషన్ చేస్తున్నారు. మరి రాజా సాబ్ టీం ఏం చేస్తున్నారన్నది తెలియదు కానీ ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో పెట్టి ఇబ్బంది పెట్టేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు.