రామ్ చరణ్-బుచ్చి బాబు కలయికలో క్రేజీ పాన్ ఇండియా ఫిలిం గా మైత్రి మూవీస్ వారు తెరకెక్కిస్తున్న RC 16 చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. తాజాగా జాన్వీ కపూర్ బర్త్ డే రోజున జాన్వీ కపూర్ మేకపిల్ల ఎత్తుకున్న స్టిల్ తో ఆమెకు RC 16 టీం బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే అదే జాన్వీ కపూర్ RC 16 ఫస్ట్ లుక్ అనుకున్నారు అంతా.
కానీ RC 16 లో జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ అది కాదని, షూటింగ్ లొకేషన్స్ లో బయట ఆమె సరదాగా ఆడుకుంటున్న సమయంలో తీసిన పిక్ తో ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేసారట. దానితో జాన్వీ ఫ్యాన్స్ అంత షాకిచ్చారేమిటి అంటూ మాట్లాడుకుంటున్నారు. జాన్వీ కపూర్ RC 16 ఫస్ట్ లుక్ ని అప్పుడే వదిలరట.
సినిమా డేట్ అనౌన్స్ చేశాకే ముఖ్యమైన పాత్రల లుక్ రివీల్ చేసేలా బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడట. మరో పక్క మార్చ్ 27 న రామ్ చరణ్ బర్త్ డే కి RC 16 టైటిల్ కానీ, లేదంటే రామ్ చరణ్ లుక్ కానీ వదిలేందుకు బుచ్చిబాబు సిద్దమవుతున్నాడట.