పుష్ప ద రూల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అల్లు అర్జున్ మూవీ మొదలు పెడతారు అనుకుంటే.. ఆయన అనూహ్యంగా కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీతో మూవీని లైన్‌లో పెట్టేశారు. త్రివిక్రమ్, అట్లీ చిత్రాలలో ఏది ముందు మొదలవుతుందో అని అల్లు అభిమానులు కన్ఫ్యూజ్ అవుతుంటే.. త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ ఆలస్యం కారణంగా అట్లీతో అల్లు అర్జున్ ముందు ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.
అల్లు అర్జున్-అట్లీ కాంబో కోసం అట్లీ సల్మాన్‌తో చెయ్యబోయే ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేసినట్లుగా వార్తలు రావడమే కాదు, అల్లు అర్జున్‌తో ఏప్రిల్‌లో అట్లీ ప్రాజెక్ట్ మొదలు కాబోతుందని అంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. మరోవైపు అల్లు అర్జున్-అట్లీ కాంబోలో ఒకరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు హీరోయిన్లు కనిపిస్తారనేలా టాక్ నడుస్తుంది.
మరి అందులో ఒకరు జాన్వీ కపూర్ అంటుంటే, మిగతా నలుగురు హీరోయిన్స్ విషయంలో పాన్ ఇండియా ప్రేక్షకుల్లో మాత్రం చాలా క్యూరియాసిటీ మొదలైంది. చూద్దాం, ఆ హీరోయిన్స్ ఎవరు అనేది? ప్రస్తుతం ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.