యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో బిజీగా వున్నారు. హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ లపై దర్శకుడు అయాన్ ముఖర్జీ స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈపాటలో బాలీవుడ్ క్యూటీ శ్రద్ద కపూర్ స్టెప్స్ వేయనుంది. ఇక ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ ఏకంగా 14 కిలోల బరువు తగ్గి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చారు.
తాజాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ కోనసీమలో సందడి చేసింది. నందమూరి వారి ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకలో నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తల్లి, భార్య ప్రణతి పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఈ వేడుకలో కనిపించకపోయినా కళ్యాణ్ రామ్ దగ్గరుండి ఎన్టీఆర్ తల్లి ఎన్టీఆర్ భార్య ప్రణతి ని వెంటబెట్టుకుని పెళ్ళికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ భార్య, ఆయన తల్లి, అలాగే కళ్యాణ్ రామ్ కోనసీమలో జరిగిన పెళ్ళికి వెళ్లిన వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.