హిందీలో ప్రస్తుతం రష్మిక విజయపరంపర కొనసాగిస్తుంది. ప్రస్తుతం అక్కడ క్రేజీ స్టార్ హీరోయిన్స్ సరసన చేరిపోయింది. స్టార్ హీరోలతో జోడి కట్టడమే కాదు గ్లామర్ గాను, అలాగే పెరఫార్మెన్స్ తోనూ రష్మీక 100 కి 100 మార్కులు రాబడుతుంది. యానిమల్, పుష్ప ద రూల్, ఛావా ఇలా బ్యాక్ టు బ్యాక్ హట్రిక్ హిట్స్ తో రష్మిక నార్త్ లో జోరుమీదుంది.
కానీ ఇప్పుడు రష్మిక జోరుకి సికిందర్ బ్రేకులు వేసేలా ఉంది. మురుగదాస్-సల్మాన్ ఖాన్ కలయికలో తెరకెక్కిన సికిందర్ చిత్రం ఈ రంజాన్ స్పెషల్ గా విడుదలకు సిద్దమవుతుంది. రీసెంట్ గా సికిందర్ నుంచి వచ్చిన టీజర్ డిజప్పాయింట్ చేసింది. దానితో మురుగదాస్ ఓ మాస్ సాంగ్ వదిలారు.
అందులో రష్మిక-సల్మాన్ కెమిస్ట్రీపై సోషల్ మీడియాలో బోలెడన్ని కామెంట్స్ కనిపించాయి. రష్మిక బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ షో చేసినా అది ఆనలేదు. సల్మాన్ ఖాన్ వయసు కొట్టచ్చిన ట్టుగా కనిపించింది. సికిందర్ మాత్రం మిస్ ఫైర్ అవడం ఖాయం, సల్మాన్ కి ఎంతగా రంజాన్ సెంటిమెంట్ ఉన్నా కంటెంట్ లేకపోతే వర్కౌట్ అవ్వదు అంటున్నారు.
సికిందర్ రిజల్ట్ తో రష్మిక సక్సెస్ పరంపరకు బ్రేకులు పడతాయనే టాక్ మొదలయ్యింది. చూద్దాం రష్మిక ఈ కామెంట్స్ ని బ్రేక్ చేసి విజయాన్ని సాధిస్తుందేమో అని.