రాజమౌళి-మహేష్ కాంబోలో జనవరిలో సైలెంట్ గా పట్టాలెక్కిన SSMB29 చిత్ర షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ కి చేరింది. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ముగించుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ కోసం కోరాపుట్ బయలు దేరింది. మహేష్, ప్రియాంక చోప్రా, రాజమౌళి కీలక నటులు అంతా ఒడిశా చేరుకున్నారు.
అయితే రాజమౌళి ఎందుకో ఏమిటో మొదటి నుంచి ఈ చిత్రం పై చాలా సీక్రెట్ ని మైంటైన్ చేస్తున్నారు. కనీసం ఓపెనింగ్ ఫోటో కూడా వదలకుండా ఊరిస్తున్నారు. దానితో ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో వియారీతమైన క్యూరియాసిటీ పెరిగిపోతుంది. దానిలో భాగంగానే ఈచిత్రానికి సంబంధించి ఏది దొరికినా దానిని వైరల్ చేస్తున్నారు ఆడియన్స్.
రెండు రోజుల క్రితం మహేష్ కోసం రాజమౌళి వేయించిన కాశీ సెట్ పిక్ లీకై సెన్సేషన్ క్రియేట్ చెయ్యగా.. ఇప్పుడు కోరాపుట్ లో జరుగుతున్న SSMB 29 షూటింగ్ కోసం వెళ్లిన మహేష్, పృథ్వీ రాజ్ ల ఎయిర్ పోర్ట్ పిక్స్ లీకయ్యాయి. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీ రాజ్ నటిస్తున్నారనే రూమర్ ను ఎయిర్ పోర్ట్ వీడియోస్ నిజం చేసేసాయి.
మహేష్-పృథ్వీ రాజ్ లకు ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ వెల్ కమ్ చెప్పిన వీడియోస్ బయటికి రావడం హాట్ టాపిక్ అవ్వగా.. రాజమౌళి అంత సీక్రెట్ మైంటైన్ చేస్తే ఇలాంటి లీకులే ఉంటాయి. జర జాగ్రత్త అంటున్నారు జనాలు.