గత ఏడాది ఇదే రోజు బాలీవుడ్ క్యూటీ జాన్వీ కపూర్ సౌత్ మూవీ దేవర నుంచి బర్త్ డే విషెస్ అందుకుంది. దేవర చిత్రంలో తంగం పాత్రలో జాన్వీ కపూర్ జాలరి పిల్లగా కనిపించింది. ఇక ఈ ఏడాది మరోసారి సౌత్ నుంచి బర్త్ డే కి స్పెషల్ విషెస్ అందుకుంది. అది కూడా మరో స్టార్ హీరో రామ్ చరణ్ RC 16 నుంచి జాన్వీ కపూర్ బర్త్ డే కి స్పెషల్ విషెస్ వచ్చేసాయి.
జాన్వీ కపూర్ మేక పిల్లని చేతిలో పట్టుకుని నైట్ వేర్ లో సరదాగా ఉన్న పిక్ ని వదులుతూ జాన్వీ కపూర్ కి బర్త్ డే విషెస్ చెప్పింది RC 16 టీమ్ . గత ఏడాది, ఈ ఏడాది జాన్వీ కపూర్ కి నిజంగా స్పెషల్ అనే చెప్పాలి. గ్లోబల్ స్టార్స్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సౌత్ ప్రేక్షకులకు దగ్గరవుతుంది.
బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా పెద్ది(వర్కింగ్ టైటిల్) లో నటిస్తుంది. ప్రస్తుతం RC 16 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఈరోజు మార్చ్ 6 బర్త్ డే జరుపుకుంటున్న జాన్వీ కపూర్ కి సినీజోష్ టీం నుంచి బెస్ట్ విషెస్ తెలుపుతూ.. ఏ వెరీ హ్యాపీ బర్త్ డే జాన్వీ కపూర్.