తెలంగాణ కాంగ్రెస్ లో గెలిచామనే ఆనందం కన్నా తాము సీఎం అవ్వలేదనే బాధ ప్రతి ఒక్క కాంగ్రెస్ నేతల్లోనూ ఉంటుంది. గెలుపు కోసం కలిసి కట్టుగా పని చెయ్యరు కానీ.. సీఎం కుర్చీ కోసం, పీసీసీ పీఠం కోసం గుద్దుకు చస్తారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్స్ అధికారం కోసం పాకులాడతారు.
రేవంత్ రెడ్డి వచ్చాక తెలంగాణాలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం రాబట్టే రాహుల్ గాంధీ రేవంత్ కి పీసీసీ చీఫ్ దగ్గర నుంచి సీఎం పీఠం వరకు కట్టబెట్టారు. రేవంత్ రెడ్డి సీఎం అనగానే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ లు ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే ఎవరి పాదయాత్ర వారిది, ఎవరి కష్టం వారిది. కానీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికే జై కొట్టారు. దానితో సీనియర్ నాయకులు అంతా గుస్సా అయ్యారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చెయ్యడానికి మనసు ఒప్పదు, మధ్యలో తీన్మార్ మల్లన్న గోల ఒకటి. రీసెంట్ గా దీప మున్షి స్థానంలో మీనాక్షి కాంగ్రెస్ చీఫ్ గా మీనాక్షి నటరాజన్ రావడం అన్ని జరిగిపోయాయి.
ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలైనా, చిన్నవాళ్ళైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, మీడియా ముందు కాంగ్రెస్ అంతర్గత కలహాలు బయట పెడితే మీనాక్షి నటరాజన్ ఊరుకోరు. ఆవిడ ఎంత సింపుల్ గా ఉంటారో, అంత కఠినంగా ఉంటారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలను సమావేశపరిచి ఒక్కొక్కరికి వార్నింగ్ ఇచ్చేసింది. మీరు నివేదికలు ఇవ్వకపోయినా ఎవరి పనితీరు ఏంటనేది తెలుసు అని మీనాక్షి నటరాజన్ తాజా సమావేశంలో కాంగ్రెస్ నేతలకు హెచ్చరికలు జారీ చేసారు.
పని చేస్తుంది ఎవరు.. నటిస్తుంది ఎవరో తనకు తెలుసని ఘాటుగా స్పందించారు. పార్టీలో తన పనితీరు నచ్చకపోయినా.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. అంతేగాకానీ, అంతర్గత విషయాలు బయట మాట్లాడవద్దని పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
మరి మీనాక్షి నటరాజన్ దెబ్బకి కాంగ్రెస్ నేతలు సెట్ అవ్వాల్సిందే, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయనేది మాత్రం ఈ సమావేశం ద్వారా అర్ధమవుతుంది.