గేమ్ చేంజర్ భామ కియారా అద్వానీ తల్లి కాబోతుంది. ఆ అపురూపమైన గుడ్ న్యూస్ ని సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీలు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసారు. అతి త్వరలో కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారు. పెళ్ళైన రెండేళ్లకే కియారా ప్రెగ్నెంట్ కావడం వారి వారి కుటుంబాలలో ఆనందాన్ని నింపింది.
మరి హీరోయిన్స్ అంటే గ్లామర్ డాల్స్ లా కఠినమైన ఆహార నియమాలను పాటిస్తూ ఇష్టమైన ఫుడ్స్ ని త్యాగం చేస్తూ కడుపు మాడ్చుకుంటూ.. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్ నెస్ కోసం కష్టపడుతూ ఉంటారు. అలా ఉంటేనే ఫిగర్ ని కరెక్ట్ గా మైంటైన్ చేయగలుగుతారు. దాని కోసం తమకిష్టమైన ఆహార పదార్ధాలను పక్కనపెడతారు.
అయితే కియారా అద్వానీ మాత్రం ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ అయ్యాను కాబట్టి కొన్నాళ్ళు పాటు నాకు ఎలాంటి ఆంక్షలు కానీ నియమాలు కానీ లేవంటుంది. వర్కవుట్లకు దూరంగా ఉంటా. ఫుడ్ విషయంలో నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. నాకు నచ్చినవి నేను తింటాను అంటూ చెప్పుకొచ్చింది.