ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. గత కొన్నాళ్లుగా దిల్ రాజు వరస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈలోగా ఆయనకు తెలంగాణ ప్రభుత్వం టీఎఫ్‌డీసీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. తాజాగా దిల్ రాజు సినిమాలు పైరసీకి గురవ్వడం వలన నిర్మాతలు నష్టపోతున్నారు.
కానీ హీరోలు ఇతర నటులకు నిర్మాతల గోడు పట్టడం లేదు, ఇలాంటి ధోరణి మాత్రం సరైనది కాదు, సినిమా ఇండస్ట్రీని పైరసీ సమస్య తీవ్రంగా వేధిస్తోందని, ఈ విషయంలో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతుంటే, హీరోలు మాత్రం ఏం పట్టించుకోకుండా తమ తదుపరి ప్రాజెక్ట్స్ లోకి వెళ్లిపోతున్నారు. కానీ తమ వరకు వస్తే కానీ ఆ నెప్పి తెలియదు అంటూ దిల్ రాజు ఘాటైన వ్యాఖ్యలు చేసారు.
అతి త్వరలోనే ఈ విషయంపై నిర్మాతలంతా కలిసి మీటింగ్ పెట్టడమే కాదు పైరసీ విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గానే కాకుండా టీఎఫ్‌డీసీ చైర్మన్గా ఈ విషయమై ప్రభుత్వంతో చర్చిస్తామని దిల్ రాజు చెప్పారు.