రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో నిరాశ పరిచే రిజల్ట్ తర్వాత గౌతమ్ తిన్ననూరి తో VD 12 స్టార్ట్ చేసాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా గౌతమ్ విజయ్ చిత్రం తెరకెక్కుతుంది. రీసెంట్ గా VD 12 టీజర్ తో పాటుగా టైటిల్ కూడా రివీల్ చేసారు. కింగ్ డమ్ అంటూ విజయ్ దేవరకొండ మాస్ అవతారం ఎత్తాడు.
ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ రాజావారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా తో ఓ చిత్రం, శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంక్రుత్యాన్ మరో చిత్రాన్ని లైన్ లో పెట్టాడు. అయితే రవి కిరణ్ కోలతో విజయ్ దేవరకొండ చెయ్యబోయే చిత్ర టైటిల్ ని రౌడీ జనార్ధనా గా పెట్టబోతున్నారనే టాక్ మొదటి నుంచి ప్రచారంలో ఉంది.
ఇప్పుడు నిర్మాత దిల్ రాజు సీతమ్మ వాకిట్లో రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రివీల్ చేసేసారు. కత్తి నాదే, నెత్తురు నాదే, యుద్ధం నాదే అనే క్యాప్షన్ తో రౌడీ జనార్దన్ తెరకెక్కబోతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్ డమ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇది అయ్యాక రౌడీ జనార్ధన సెట్స్ పైకి వెళ్లేలా ఉంది.