మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అంటూ అవమానిస్తూ కామెంట్స్ చెయ్యడమే కాదు అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమంటూ శపధాలు చేసిన వైసీపీ నేతలు ఇంట్లో కూర్చుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో కీలకంగా మారారు.
తాజాగా జగన్ పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ, పవన్ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా, 175 మందిలో ఒకరికి ఇచ్చినట్టు టైమ్ ఇస్తామంటే ఎలా, సభలో ఇంతమంది సభ్యులు ఉంటేనే.. ప్రతిపక్ష హోదా ఉంటుందని ఎక్కడా రూల్ లేదు.
చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చా, ఎంతసేపైనా మాట్లాడమని చంద్రబాబుకు మైక్ ఇచ్చా, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు రిగ్గింగ్ చేశారు, ఉత్తరాంధ్ర టీచర్ ఓటర్లు బుద్ధి చెప్పారు అంటూ ప్రతిపక్ష హోదా విషయంలో జగన్ అటు పవన్ ఇటు చంద్రబాబు పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.