నిన్నసాయంత్రం అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై హోలిస్టిక్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. నిన్నటి నుంచి కల్పనకు వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆమె ప్రమాదం నుంచి బయటపడినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం నిలకడగా కల్పన ఆరోగ్య పరిస్థితి ఉన్నట్లుగా వైద్యులు ప్రకటించారు. ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు తీసుకోవడంతో కల్పన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లుగా చెబుతున్నారు. నిన్న రాత్రి ఆసుపత్రికి రాగానే కల్పనకు వైద్యులు స్టమక్ వాష్ చేసి ఆమె వైద్యం అందించారు.
ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్‌పై కల్పన కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ నుంచి కల్పన బయటకు వచ్చినట్లుగా వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసి మీడియా తో మాట్లాడారు.