ఫైనల్ గా మెగా బ్రదర్ నాగబాబు కు న్యాయం జరిగింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కి తగిన న్యాయం చేసారు. శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబు కి పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఫైనల్ గా నాగబాబు ఎమ్యెల్సీగా కొత్త బాధ్యతలు కోసం రెడీ అవ్వగా.. జనసైనికులు రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటికి నాగబాబు కి తగిన హోదా లభిస్తుంది అని వారు సంబరపడుతున్నారు. ఇక మినిస్టర్ పదవి మాత్రమే బ్యాలెన్స్ ఉంది అంటూ వారు మాట్లాడుకుంటున్నారు.