తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కోసం 2024 ఎన్నికల ముందు నుంచే కష్టపడి పని చేస్తున్న నాగబాబు కి పవన్ కళ్యాణ్ పదవిని ఎప్పుడెప్పుడు కట్టబెడతారా అని జనసైనికులు ఎదురు చూస్తున్నారు. రాజ్యసభ ఎంపీ సీటు ఖాయమనుకుంటే అది కూటమి పొత్తు కోసం త్యాగం చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు ఎమ్యెల్సీ కోటాలో నాగబాబు కి పదవి ఖాయమన్నారు.
కాదు చంద్రబాబు స్వయానా పవన్ కళ్యాణ్ కి మాటిచ్చారు. ఎమ్యెల్సీ తో పాటుగా నాగబాబు కి మంత్రి పదవి దక్కుతుంది అని. అంతా ఓకె అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ నాగబాబు కి మినిస్టర్ పోస్ట్ విషయంలో ఆలోచనలో పడ్డారట. రీసెంట్ గా అసెంబ్లీ ఆవరణలో పవన్-చంద్రబాబు లు గంటసేపు చర్చలు జరిపారు. ఆ చర్చల్లో పవన్ కళ్యాణ్ నాగబాబు కి మినిస్టర్ పోస్ట్ కన్నా నామినేటెడ్ పోస్ట్ అయితే బావుంటుంది అనే ప్రతిపాదన బాబు వద్ద ఉంచినట్లుగా తెలుస్తోంది.
నాగబాబు మంత్రిగా ఉండటం కన్నా.. వేరే ఏదైనా కీలకమైన కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమిస్తే బావుంటుంది అని పవన్ అనుకుంటున్నారట. సామాజిక సమీకరణాలు, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుని పవన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. నాగబాబు కి ఎమ్యెల్సీ పదవి విషయంలో కానీ మంత్రి పదవి విషయంలో కానీ ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ పవన్ తుది నిర్ణయం ఎలా ఉండబోతుందో అని జనసైనికులు ఎదురు చూస్తున్నారు.