చాలామంది హీరోలకు అభిమానులు ఇష్టంగా బిరుదులు ఇచ్చి పిలుచుకుంటారు. అభిమానుల కోరిక కాదనలేక వారు కూడా టైటిల్ కార్డ్స్ లో ఆ బిరుదును వేసుకుంటారు. మెగాస్టార్, పవర్ స్టార్, నటరత్న, యువ సామ్రాట్, విక్టరీ, యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్, ఐకాన్ స్టార్, సూపర్ స్టార్ ఇలా స్టార్ హీరోలకు పేర్లకు ముందు బిరుదులు ఉంటాయి. అభిమానుల కోరిక ప్రకారమే హీరోలు నడుచుకుంటారు, అలా పిలిస్తే వారికీ ఇష్టమే.
కోలీవుడ్ లో నయనతారకు లేడీ సూపర్ స్టార్ బిరుదుని కట్టబెట్టారు ఫ్యాన్స్. హీరోలతో సమానమైన బిరుదుతో నయనతార క్రేజ్ ఉంటుంది. అందుకే అభిమానులు ఆమెను లేడీ పవర్ స్టార్ గా పిలుచుకుంటారు. కానీ నయనతార మాత్రం అలాంటి బిరుదులేమి వద్దంటుంది. తనని ఇకపై అలా లేడీ పవర్ స్టార్ అని పిలవొద్దంటుంది.
నన్ను అందరూ లేడీ సూపర్ స్టార్ అంటూ పిలుస్తారు, మీ అభిమానం నుంచి అలాంటి బిరుదు పుట్టుకొచ్చింది అని నాకు తెలుసు. కానీ నాకు అలాంటి బిరుదులొద్దు. నాకు నయనతార అని పిలిస్తేనే ఇష్టం. నన్ను నయనతార అనే పిలవండి, నామనసుకు దగ్గరైన పేరు నయనతార అంటూ నయనతార ఫ్యాన్స్ కి ఓపెన్ రిక్వెస్ట్ పెట్టింది.