శ్రీలీల కల నెరవేరింది. కెరీర్ ఆరంభంలోనే శ్రీలీల బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేసింది. నిన్నమొన్నటివరకు గాలి వార్తలే ఈరోజు నిజమయ్యాయి. కార్తీక్ ఆర్యన్ సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇస్తుంది శ్రీలీల. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్-శ్రీలీల మూవీ కి సంబంధించి టీజర్ వచ్చేసింది.
తాజాగా శ్రీలీల కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ ఈవెంట్ లో మెరవడమే కాదు శ్రీలీల ఆ ఫంక్షన్ లో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. అది చూసిన ఆమె ఫ్యాన్స్ బాలీవుడ్ పార్టీలో శ్రీలీల డాన్స్ తో దుమ్మురేపుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆమె మాములుగా కాలు కదిపినా అది ఇప్పుడు సన్సేషన్ అవుతుంది.
మెల్లగా బాలీవుడ్ లో శ్రీలీల పాగా వెయ్యడం స్టార్ట్ చేసేసింది. ఇదే కాదు సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తోను శ్రీలీల ఒక చిత్రాన్ని ఓకె చేసింది అనే టాక్ ఉంది. తెలుగులో అమ్మడు మరోసారి బిజీ కాబోతుంది. రవితేజ, నితిన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.