ప్రముఖ టాలీవుడ్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం అందరికి షాకిచ్చింది. కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె గతంలో పెళ్ళైన కొద్ధి రోజులకే భర్తతో విడిపోయింది. భర్త టార్చర్ తట్టుకోలేక సపరేట్ అయినట్లుగా చాలా సందర్భాల్లో చెపింది.
నిజాంపేటలో తన భర్తతో కలిసి నివాసముంటున్న కల్పన.. గత రెండు రోజులుగా ఇంటి డోర్ తియ్యకపోవడంతో అపార్ట్మెంట్ వాళ్ళు కల్పనా ఇంటి డోర్ ఓపెన్ చేయలేదంటూ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు హుటాహుటిన కల్పన అపార్ట్మెంట్ కు చేరుకున్నారని..
పోలీసులు తలుపులు పగలగొట్టి అపస్మారకస్థితిలో ఉన్న కల్పనను ఆస్పత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు.