నటుడు పోసాని కృష్ణమురళి ని రాజాం పేట పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని పోసాని ఇంట్లో అరెస్ట్ చేసి రాజాం పేట తరలించగా ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈలోపు నరసరావుపేటలో పోసానిపై మరో కేసు నమోదు కాగా రాజాపేట జైలు నుంచి నరసారావు పేట పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో ప్రవేశపెట్టగా.. నరసారావు పేట కోర్టు ఆయనకు 10రోజుల రిమాండ్ విధించింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు అయ్యాయి. దానితో పోసానిని పోలీసులు చెడుగుడు ఆడుకుంటున్నారు. తాజాగా నరసారావు పేట సబ్ జైలు నుంచి కర్నూలు పోలీసులు పోసాని ని అదుపులోకి తీసుకుని కర్నూలు తరలించారు.
కర్నూలులో పోసాని పై కేసు నమోదు కావడంతో ఆయనని అక్కడికి తరలించారు. మరి నాలుగు రోజుల్లో పోసాని నాలుగు జైళ్లకు షిఫ్ట్ అయ్యారు, ఇకపై ఎన్ని జైళ్లకు మారాల్సి ఉంటుందో, పోలీసులు పోసానితో చెడుగుడు ఆడుతున్నారుగా అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.