మిల్కి బ్యూటీ తమన్నా, విజయ్ వర్మతో రెండేళ్ల ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసిందా, లవ్ కి బ్రేకప్ చెప్పేసిందా ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రశ్న. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్ళు సీక్రేట్ గా డేటింగ్ చేసిన తమన్నా ఆ తర్వాత తమ ప్రేమను అఫీషియల్ గా బయటపెట్టకపోయినా.. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
కొన్నాళ్లుగా తమన్నా-విజయ్ వర్మ కలిసి కనిపించడం లేదు. దానితో వారి మద్యన బ్రేకప్ అయ్యింది అనే న్యూస్ కొద్దిరోజులుగా వినిపిస్తుంది. ఈరోజు ఒక్కసారిగా తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముంబై మీడియా కథనాల ప్రకారం తమన్నా, విజయ్ వర్మలు లు విడిపోవాలని నిర్ణయించుకున్నారట.
ప్రేమికులుగా విడిపోయినా..స్నేహితులుగా కలిసి ఉండాలని వారిరువురు మధ్యన ఒప్పందం కుదిరింది అంటున్నారు. అందుకే ఇద్దరూ కలిసి కనిపించడం లేదు, తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్ వార్తలు ఇప్పటికి పుకార్లుగానే మిగిలినా, ఇంకొంతకాలం వారు కలిసి కనిపించకపోతే అది నిజమని నమ్మాల్సిందే అంటున్నారు.