యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటున్నారు. జిమ్ లో కష్టపడుతూ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తున్నారు. వార్ 2 లో రా ఏజెంట్ గా యుగంధర్ పాత్రలో కనిపించబోతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం కొత్తగా మేకోవర్ అవుతున్నారు.
ఆయన ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే చిత్రం కోసం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ 14 కేజీల బరువు తగ్గి సూపర్ ట్రాన్స్ఫర్మేషన్ లో కనిపించి అభిమానులకి షాకిచ్చారు. ఎన్టీఆర్ ని జిమ్ లో అలా చూసిన వారు ఏంటిరా ఎన్టీఆర్ షాకింగ్ లుక్ లో మతిపోగొడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ హీరో లేని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ కూడా నీల్ తో కలిసి సెట్స్ లో జాయిన్ అవుతారు. ప్రస్తుతం ఆయన వార్ 2 స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్పెషల్ సాంగ్ లో స్టెప్స్ వెయ్యడానికి రెడీ అయ్యారు.