జనసేన నేత కిరణ్ రాయల్ పై లక్ష్మి అనే మహిళా రీసెంట్ గా సంచలన ఆరోపణలు చేస్తూ తనకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నాడు అంటూ ఛానల్స్ ముందు చేసిన కామెంట్స్ వైసీపీ పార్టీకి అస్త్రంగా మారింది. అంతేకాదు మీడియా ఛానల్స్ లో లక్షి తెగ హడావిడి చేసింది. ఈ మధ్యలో చెక్ బౌన్స్ కేసులో లక్ష్మి అరెస్ట్ అయ్యి వచ్చాక కూడా కిరణ్ రాయల్ పై మరిన్ని ఆరోపణలు చేసింది లక్ష్మి.
తాజాగా కిరణ్ రాయల్ తో లక్ష్మి వివాదం ముగిసింది. వారి మద్యలో ప్యాచప్ అవడంతో లక్ష్మి మీడియాతో మట్లాడుతూ..
కిరణ్ రాయల్ తో ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకుంటున్నాము... నా కుటుంబ సమస్యలు వల్లే బయటకు వచ్చాను. కానీ రాజకీయ పార్టీలు నన్ను వాడుకున్నాయి... రెండు పార్టీల వాళ్ళు ట్రోల్స్ చేసుకున్నారు.. నా సమస్యను వేరే వాళ్లు రాజకీయం కోసం వాడుకున్నారు. దీంతో నాకు సంబంధం లేదు...
ఒక్క వీడియో తప్ప మిగతావి నేను విడుదల చేయలేదు, కొన్ని పాత వీడియోలు బయటకు వచ్చాయి, జన సేన పార్టీ నేతలే డబ్బులు ఇప్పిస్తామని నా దగ్గర వీడియోలు తీసుకున్నారు, వారి నుంచే ఇవి బయటకు వచ్చాయి, వీడియోల్లో ఏమి మార్పులు చేసి బయటకు వదిలారో నాకు తెలియదు, జన సేన పార్టీ జిల్లా అధ్యక్షుడు హస్తం ఇందులో ఉంది, వీటితో నాకు సంబంధం లేదు..
పార్టీల పరంగా ఉన్న విబేధాలులోకి నన్ను లాగారు, నాకు చాలా డ్యామేజ్ జరిగింది, కిరణ్ రాయల్ తో రాజీ అనేది మేము బయట తేల్చుకుంటాను, నా పిల్లలు కోరిక మేరకే ఈ వివాదం ఇక్కడితో ముగిస్తున్నాను. దీనికి రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేదు... నన్ను ఎవరూ భయపెట్టలేదు, నా మాటలు బాధ పెట్టి ఉంటే క్షమించండి, ఇక ఇక్కటితో వీటిని ఆపేయాలని చూస్తున్నాను... అంటూ కిరణ్ రాయల్ తో లక్ష్మి కాంప్రమైజ్ అయినట్లుగా ప్రకటించింది.