కొద్దిరోజులు సినిమా అవకాశాలు లేక రిలాక్స్ అయిన పూజ హెగ్డే మరోసారి బిజీ తారగా మారిపోయింది. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన పూజ హెగ్డే సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పూజ హెగ్డే కి బాలీవుడ్ ఎప్పటికప్పుడు షాకిస్తూనే ఉంది. రీసెంట్ గా కూడా పూజ హెగ్డే దేవా రిజల్ట్ తో డిజప్పాయింట్ అయ్యింది.
ప్రస్తుతం పూజ హెగ్డే సౌత్ లో అందులోను తమిళనాట ఫుల్ బిజీగా కనిపిస్తుంది. అక్కడ స్టార్స్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న పూజ హెగ్డే తాజాగా సౌత్-నార్త్ అవకాశాలపై మాట్లాడింది. ఎక్కడ ఎవరు అవకాశం ఇస్తే వారికే నా ప్రాధాన్యత అంటుంది. ఛాన్స్ ఇస్తుంది నార్త్ లేదా సౌత్ అని చూడను. అసలు ఆ డిఫరెన్స్ నాకు లేదు.
మనకు ఎవరు అవకాశాలు ఇస్తారో, ఎవరు ఆదరిస్తారో వారే ముఖ్యం. అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలోనే నేను కష్టపడి నా కెరీర్ ను నిర్మించుకున్నాను. ఇది గొప్ప ప్రయాణం. ప్రతి సినిమా మనల్ని ఎదిగేలా చేయగలవు. అందుకే ప్రతి సినిమా నాకు ముఖ్యమే. అవే మనల్ని ఎదిగేలా చేస్తాయి, అవే మనల్ని నాశనం చేస్తాయి.
అవకాశాలు రావాలంటే సక్సెస్ ఉండాల్సిందే. మనలో ఏదో ఒక ప్రత్యేకతను ప్రేక్షకులు గమనిస్తారు. బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాను. సౌత్ మూవీస్ బాలీవుడ్లో అదరగొడుతున్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. భాష ఏదైనా మంచి పాత్రలు చేస్తే ఎవరైనా ఆదరిస్తారు అదే నమ్ముతాను అంటూ పూజ హెగ్డే చెప్పుకొచ్చింది.