బాలీవుడ్ లో విక్కీ కౌశల్-రష్మిక కలయికలో ఫిబ్రవరిలో విడుదలైన ఛావా చిత్రం థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఛావా ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్దమవుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఛావా కు బ్రహ్మరధం పడుతున్నారు.
రేపు శుక్రవారం తెలుగులో విడుదల కాబోతున్న ఛావా చిత్రం కి సంబందించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని బాలాజీ థియేటర్ కి మొన్న రాత్రి 11:30 PM షో టైమ్ లో కొంతమంది ఛావా షోకి వచ్చి క్లైమాక్స్ ఎమోషనల్ సన్నివేశం వస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా హేళన చేస్తూ నవ్వడం అక్కడున్న ఛావా అభిమానులకు కోపం తెప్పించింది.
క్లైమాక్స్ లో విచక్షణ కోల్పోయి వెర్రి చేష్టలు చేస్తూ నవ్వినా వాళ్ళను థియేటర్‌లోని మిగతా ప్రేక్షకులు తగిన దేహశుద్ధి చేసి గుణపాఠం చెప్పి.. వారితో క్షమాపణలు చెప్పించారు.. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.