ఎవరయినా టాప్ రేంజ్ కి చేరుకున్నాక మూలాలు మర్చిపోకూడదు అంటారు. కానీ కన్నడ గర్ల్ రష్మిక మాత్రం తన మాతృ భూమిని మర్చిపోయేలా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, ఆమె బిహేవియర్ కి కన్నడిగుల ఆగ్రహానికి పదే పదే గురవుతుంది. మొన్నటికి మొన్న బాలీవుడ్ మీడియా తో తాను హైదరాబాద్ నుంచి వచ్చాను అంది.
అంటే తను కన్నడ నుంచి కాదు హైదరాబాద్ అని నేషనల్ మీడియా ముందు అనడం కన్నడ ప్రేక్షకులకు నచ్చలేదు. ఇప్పుడు ఆమెను బెంగుళూరు లో జరుగుతున్నఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి అతిదిగా రావాలంటూ కాంగ్రెస్ ఎమ్యెల్యే రశ్మికను పలుసార్లు ఆహ్వానించినా ఆమె స్పందించకపోవడం ఆయనకు కోపాన్ని తెపించింది.
దానితో ఆ ఎమ్యెల్యే రష్మికపై తీవ్ర విమర్శలు చేశారు. రశ్మికకు బుద్ధి చెప్పాల్సిన టైమ్ వచ్చింది అంటూ ఆయన బహిరంగంగానే కామెంట్స్ చెయ్యడం మరో దుమారాన్ని రష్మిక తగిలించుకుంది. టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక ఇలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడం మాత్రం షాక్ అనే చెప్పాలి.