మెగాస్టార్ నటించిన విశ్వంభర రిలీజ్ పై సందిగ్దత నెలకొంది. సోషల్ మీడియాలో విశ్వంభర చిత్రం విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలతో మెగా ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. గేమ్ చేంజర్ కోసం విశ్వంభర ను పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా మేకర్స్ కలరింగ్ ఇచ్చారు.
గేమ్ చేంజర్ వచ్చింది వెళ్ళింది, కానీ విశ్వంభర కు కొత్త తేదీ దొరకలేదు.. అంటూ కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు విశిష్ట విశ్వంభరను ఏం చేస్తున్నాడో, ఆ గ్రాఫిక్స్ విషయంలో తేడా కొడితే ఎలా అంటూ మెగా అభిమానులు అందోళన పడుతున్నారు. తాజాగా విశ్వంభర విడుదల తేదీపై కొత్త న్యూస్ వినిపిస్తోంది.
అది మెగాస్టార్ బర్త్ డే ఆగష్టు 22వరకు విశ్వంభర వచ్చే ఛాన్స్ లేదు. మెగాస్టార్ బర్త్ డే రోజుకి విశ్వంభర ను ప్లాన్ చేసినా చెయ్యొచ్చు అంటూ సరికొత్త న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లుకు కొడుతోంది. మరిన్ని ఊహాగానాలకు మేకర్స్ ఆ తేది ఏదో ప్రకటించి చెక్ పెట్టొచ్చుగా..