Advertisementt

పోసానిపై 17 కేసులు-14 రోజుల రిమాండ్

Mon 03rd Mar 2025 09:05 PM
posani  పోసానిపై 17 కేసులు-14 రోజుల రిమాండ్
Posani faces 17 cases remanded for 10 days పోసానిపై 17 కేసులు-14 రోజుల రిమాండ్
Advertisement
Ads by CJ

నటుడు పోసాని కృష్ణమురళీపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీలో పలు చోట్ల పలువురు పోసానిపై కంప్లైంట్ ఇవ్వడంతో పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఓబులవారిపల్లిలో నమోదైన కేసులో పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ గచ్చిబౌలి మై హోమ్ బుజ లో అరెస్ట్ చేసి రాజంపేట జైలులో ఉంచగా.. ఈరోజు మరో కేసు విషయంలో పోసానిపై పల్నాడు జిల్లా నరసరావుపేట టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానితో నరసరావుపేట పోలీసులు ఇవాళ పీటీ వారెంట్ పై పోసానిని అదుపులోకి తీసుకుని ఈరోజు సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. ఈకేసులో కోర్టు పోసాని కి ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అక్కడి నుంచి పోసానిని గుంటూరు జైలుకు తరలించారు.

Posani faces 17 cases remanded for 10 days:

Posani remanded for 10 days

Tags:   POSANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ