కమెడియన్ ధనరాజ్ దర్శకుడిగా మారి నటుడిగా కీలక పాత్ర పోషించిన రామం రాఘవం చిత్రం రీసెంట్ గానే థియేటర్స్ లో విడుదలైంది. రాంగ్ టైమ్ లో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు సో సో గా ఆదరించారు. అదే రోజు డబ్బింగ్ చిత్రాల హవా కనిపించడం రామం రాఘవం కి మైనస్ అయ్యింది.
సముద్రఖని-ధనరాజ్ కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈచిత్రం థియేటర్స్ లో నిరాశపరిచింది అనే చెప్పాలి. రామం రాఘవం చిత్ర డిజిటల్ హక్కులను ఈటివి విన్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. మరి థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన రామం రాఘవం చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.
అతి త్వరలోనే ఈటీవీ విన్ నుంచి రామం రాఘవం చిత్రం స్ట్రీమింగ్ లోకి రాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. మరి ఈ తండ్రి కొడుకుల డ్రామాను థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఈటివి విన్ లో వీక్షించి ఆనందించెయ్యండి.