గెలుపు కోసం అమరావతి రాజధాని అని చెప్పి.. గెలిచాక మూడు రాజధానుల కాన్సెప్ట్ కి తెర తీసిన వైసీపీ పార్టీకి మరొక అవకాశం ఇవ్వకుండా ఓడించి వదిలిపెట్టారు ప్రజలు. వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానులు అంటూ వైజాగ్, కర్నూల్, అమరావతి అంటూ అని ఐదేళ్లుగా అమరావతిని సర్వనాశనం చేసి రైతులు, ప్రజల ఆగ్రహానికి గురయ్యింది వైసీపీ పార్టీ.
అమరావతి స్మశానమంటూ బొత్స లాంటి వాళ్లకు, అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం అవ్వకూడదు, ఒకేచోట రాజధాని రెడీ చేస్తే మరో హైదరాబాద్ లా అమరావతి తయారవుతుంది, కాదు అమరావతి వరదలొస్తే మునిగిపోతుంది అంటూ విష ప్రచారం చేసిన వైసీపీ పార్టీ ఆ మూడు రాజధానులను సరి చెయ్యడం చేతకాలేదు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో వైసీపీ పార్టీ నేతలు రాజధాని విషయంలో స్వరం మారుస్తున్నారు.
ఈరోజు శాసన మండలిలో వైసీపీ ఎమ్యెల్సీ బొత్స సత్యన్నారాయణ రాజధాని అమరావతి పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
మూడు రాజధానిలనేది ఆ రోజుకు మా విధానం, రాజధానిపై ఇప్పుడు మా విధానం ఏమిటనేది చర్చించి చెబుతాం, రాజధానిపై మా విధానం ఏమిటనే విషయాన్ని డిస్కస్ చేసుకుని చెబుతాం, అమరావతి స్మశానం లా ఉందని నేను వ్యాఖ్యానించిన మాట వాస్తవమే
ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి ఆ రోజు నేను అలా మాట్లాడా, తెదేపా హయాంలో అమరావతి కోసం 6 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు, అమరావతి వల్లకాడులా మారింది అక్కడికి వెళ్లి ఏం చేస్తామని గతంలో నేను మాట్లాడా అంటూ బొత్స చేసిన కామెంట్స్ చూసిన వాళ్ళు వైసీపీ పార్టీ మూడు రాజధానుల విషయం పక్కనపెట్టి అమరావతికి జై కొట్టేలా ఉంది అంటూ మట్లాడుకునున్నారు.