యంగ్ టైగర్ ఎన్టీఆర్-కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో రీసెంట్ గా మొదలైన ఎన్టీఆర్-నీల్ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో చిత్రీకరణ సాగుతుంది. అతి త్వరలోనె ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవుతారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ కి మొదటి నుంచి డ్రాగన్ టైటిల్ వాడుకలో ఉండగా.. ఇప్పుడు ఈ టైటిల్ పై తీవ్ర ఉత్కంఠ నడుస్తుంది. 1960ల కాలంలో బెంగాల్ లోని కొన్ని అల్లర్ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారని టాక్ ఉంది. తాజాగా మైత్రి నిర్మాతల్లో ఒకరైన రవి డ్రాగన్ పై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు.
తాజాగా ఆయన మట్లాడుతూ.. ఈ సినిమా గురించి ఎవరు ఎంతైన ఎక్స్ పెక్ట్ చేయొచ్చట. ఎవరు ఎంత ఎక్స్ పెక్ట్ చేసినా అంతకు మించిన హై ఉంటుందటున్నారు. అంతేకాదు ఆకాశమే హద్దుగా అంచనాలు పెట్టుకోవచ్చు, అయినా అంతకు మించి ఇస్తాం, మూవీని చెప్పిన టైమ్ కి అంటే 2026 జనవరి 9 కే విడుదల చేసేలా ప్రయత్నిస్తున్నాం అంటూ ఎన్టీఆర్-నీల్ పై హై రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు.