మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం విశ్వంభర రిలీజ్ పై మీడియాలో రోజుకో న్యూస్ కనిపించడమే కాదు పలు రకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నా మేకర్స్ మాత్రం విశ్వంభర విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ నడిపిస్తున్నారు. మరోపక్క మెగాస్టార్ చిరుతో మూవీ కథ కోసం అనిల్ రావిపూడి వైజాగ్ లో కూర్చున్నాడు.
తాజాగా అనిల్ రావిపూడి చిరుతో చెయ్యబోయే చిత్రం పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ పై వర్క్ జరుగుతుంది, రెండు ఫన్ సీక్వెన్సెస్ ను ఫైనల్ చేశాం, స్క్రిప్ట్ చాలా బాగా వస్తోందని అనిల్ రావిపూడి చిరు సినిమా విషయంలో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.
చిరు తో చెయ్యబోయే సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది. మరోపక్క ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చిరు ఆల్ రెడీ చెప్పారు. అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి సినిమాలో ఆయా సన్నివేశాల గురించి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను.. అంటూ మరింత ఆసక్తిని క్రియేట్ చేసారు.