గ్లామర్ చూపిస్తేనే ఆఫర్స్ వస్తాయి, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలోస్తాయి.. అదే సాంప్రదాయ లుక్ లో కనిపించి, భార్య తల్లి పాత్రలు ఎంచుకుంటే అవకాశాలు తగ్గుతాయని భావించే హీరోయిన్స్ లిస్ట్ లో లక్కీ భాస్కర్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఉంది. ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసేందుకు సిద్దమయిన హీరోయిన్.
అందుకే సోషల్ మీడియా లుక్స్ లోను మీనాక్షి చౌదరి అందాలు ఆరబోసేందుకే మొగ్గు చూపిస్తుంది. అలాంటి మీనాక్షి చౌదిరి తాజాగా ట్రెడిషనల్ గా కనిపించేసరికి ఆమె అభిమానులు షాకవుతున్నారు.
డిజైనర్ వేర్ లెహంగాలో మీనాక్షి చౌదరి చేతికి గాజులు, నుదురుతున పాపిడి చైన్ పెట్టుకుని సాంప్రదాయంగా కనిపించడమే కాదు ఆ లుక్ లో మీనాక్షి చౌదరి బ్యూటిఫుల్ గా మెరిసిపోయింది. ఆ లుక్ లో మీనాక్షి చౌదరిని చూసిన వారు ఫిదా అవ్వాల్సిందే.