కూల్ అండ్ రొమాంటిక్ చిత్రాలు ఎన్ని చేసినా రాని ఫేమ్ మాస్ యాక్షన్ ఎంటెర్టైనెర్స్ తో వచ్చేస్తుంది. అందుకే ప్రతి ఒక్క హీరో యాక్షన్ చిత్రాలతో మాస్ ఆడియన్స్ కు దగ్గరవ్వాలని చూస్తారు. నేచురల్ స్టార్ నాని మధ్య మధ్యలో మాస్ ని టచ్ చేసినా నానికి అంతగా కలిసి రాలేదు. దసరా చిత్రంతో శ్రీకాంత్ ఓదెల తో కలిసి నాని 100 కోట్లు కొల్లగొట్టాడు.
ఇప్పుడు అదే కాంబినేనేషన్ లో రాబోతున్న ద ప్యారడైజ్ మాత్రం నాని కెరీర్ లోనే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. దసరా చిత్రానికి మించి శ్రీకాంత్ ఓదెల నాని తో ద ప్యారడైజ్ చిత్రాన్ని తెరకెక్కస్తున్నట్లుగా మేకర్స్ వదిలిన గ్లిమ్ప్స్ తో అర్ధమవుతుంది. మొన్న నాని బర్త్ డే కి ఆయన నటిస్తున్న హిట్ 3 టీజర్ ఎంత వైలెంట్ గా ఉందొ.. ఇప్పుడు ద ప్యారడైజ్ గ్లిమ్ప్స్ అంతకు మించి వైలెంట్ గా కనిపిస్తుంది.
నాని లుక్ ఆయన కెరీర్ లో బెస్ట్ లుక్ గా ఉండబోతుంది. అనిరుధ్ మ్యూజిక్, శ్రీకాంత్ ఓదెల మేకింగ్ అన్ని ద ప్యారడైజ్ గ్లిమ్ప్స్ లో హైలెట్ అవ్వగా.. ఈ చిత్రం ఫుల్ యాక్షన్ కథా చిత్రంగా ఉండబోతుంది అనేది స్పష్టమవుతుంది. ఈ దెబ్బకి నాని పర్ఫెక్ట్ యాక్షన్ హీరో అనిపించుకోవడం ఖాయం అంటున్నారు ఆయన ఫ్యాన్స్.