Advertisementt

ఫైనల్లీ శర్వా మనమే కి ఓటీటీ మోక్షం

Mon 03rd Mar 2025 11:33 AM
manamey  ఫైనల్లీ శర్వా మనమే కి ఓటీటీ మోక్షం
Manamey Finally Arrives on OTT ఫైనల్లీ శర్వా మనమే కి ఓటీటీ మోక్షం
Advertisement
Ads by CJ

శర్వానంద్ - కృతి శెట్టి కలయికలో గత ఏడాది థియేటర్స్ లో విడుదలైన మనమే చిత్రం జస్ట్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలై కొన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటికి ఓటీటీ స్ట్రీమింగ్ కి నోచుకోలేదు. అమెజాన్ ప్రైమ్ వారు ఫ్యాన్సీ డీల్ తో మనమే చిత్ర డిజిటల్ హక్కులను దక్కించుకున్నారు. 

కొన్ని ప్రాబ్లెమ్ వలన అదిగో, ఇదిగో అన్న మనమే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫైనల్లీ కన్ ఫర్మ్ అయ్యింది. జూన్ 7 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఎనిమిది నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. 

ఈ నెల 9 నుంచి అంటే వచ్చే ఆదివారం నుంచి శర్వానంద్ మనమే చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి అందుబాటులోకి రానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అది చూసి ఫైనల్లీ శర్వానంద్ మనమే ఓటీటీ లోకి వస్తుంది అంటూ నెటిజెన్స్ నిట్టూర్పులు వదులుతున్నారు. 

Manamey Finally Arrives on OTT:

Manamey To Stream On Prime Video From This Date

Tags:   MANAMEY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ