సంక్రాంతికి వస్తున్నాం చిత్రం థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ సునామి సృష్టించింది. జనవరి 14 న థియేటర్స్ లో విడుదలైన వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 300 కోట్ల తొ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ కలెక్షన్స్ పెరగడానికి బాగా హెల్ప్ అయ్యాయి.
థియేటర్స్ లో రికార్డ్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సంక్రాంతికి కాస్తున్నాం చిత్రం ఈ శనివారం జీ తెలుగులో సాయంత్రం ఆరు గంటలకు టీవీ ప్రీమియర్స్ గాను, జీ 5 ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి రాగా ఇప్పుడు ఓటీటీలోనూ సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్ వ్యూస్ తో సునామి సృష్టించింది.
100 మిలియన్ వ్యూస్ తో 12గంటల్లో సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్ క్రియేట్ చేసింది. థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్, అలాగే థియేటర్స్ లో చూసి కామెడీ కోసం మరొకసారి ఓటీటీ లో వీక్షించడం ఈ సినిమా క్రేజ్ కి నిదర్శనం అని చెప్పాలి.