చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై నోటికొచ్చినట్లుగా అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిని రాజం పేట పోలీసులు హైరాబాద్ లోని పోసాని ఇంట్లోనే అరెస్ట్ చేసి రాజం పేట తరలించగా ఆయనకు రాజం పేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రాజంపేటలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళి పై మరికొన్ని కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని నరసరావుపేట పోలీసులకు జనసేన నేతలు ఫిర్యాదు చెయ్యడంతో పోసానిపై 153-ఎ, 504, 67 ఐటీ కింద కేసు నమోదు చేసారు నరసరావుపేట పోలీసులు.
దానితో నరసారావు పేట పోలీసులు రాజంపేట సబ్ జైలుకు వచ్చి పోసానిని పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేట సీఐ హైమారావు ఆధ్వర్యంలో పోసానిని నరసారావు పేట తరలించి ఈరోజు నరసారావు పేట కోర్టులో పోసానిని హాజరు పరచనున్నారు.