Advertisementt

తండేల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Sun 02nd Mar 2025 04:40 PM
thandel ott  తండేల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది
Thandel to Stream on Netflix from March 7th తండేల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది
Advertisement
Ads by CJ

యువ సామ్రాట్ నాగ చైతన్య లేటెస్ట్ సంచలనం తండేల్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ తండేల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రకారం ఈ సినిమా మార్చి 7 నుండి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషలలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, విడుదలైన అన్నిచోట్ల దుల్లగొట్టేసే రెస్పాన్స్‌తో తక్కువ సమయంలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇందులో ఉన్న కంటెంట్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సాయి పల్లవి నటన, చందూ మొండేటి దర్శకత్వ ప్రతిభ, గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు అన్నీ కలిసి ఈ సినిమాను విజయ తీరానికి చేర్చాయి.

మరీ ముఖ్యంగా నాగ చైతన్య ఈ సినిమాతో నటన పరంగా మరో మెట్టు ఎక్కాడని అనిపించుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడనేలా అందరి ప్రశంసలు అందుకున్నాడు. మరో వైపు పైరసీ భూతం కూడా ఈ సినిమాను వెంటాడింది. అయినా కూడా థియేటర్లలో నిలబడి ఘన విజయం అందుకుందీ చిత్రం. 

మరి థియేటర్లలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందనను రాబట్టుకుంటుందో తెలియాలంటే మాత్రం మార్చి 7 వరకు వెయిట్ చేయాల్సిందే. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌ పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Thandel to Stream on Netflix from March 7th:

Naga Chaitanya Starring Thandel Gets an OTT Release Date

Tags:   THANDEL OTT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ