Advertisementt

యుకె సిటిజన్ షిప్‌పై చిరు టీమ్ వివరణ

Mon 03rd Mar 2025 09:58 AM
chiranjeevi  యుకె సిటిజన్ షిప్‌పై చిరు టీమ్ వివరణ
Chiranjeevi UK Citizenship Rumors: Team Clarifies the Truth యుకె సిటిజన్ షిప్‌పై చిరు టీమ్ వివరణ
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం అంటూ సోషల్ మీడియాలోనూ, కొన్ని వెబ్‌సైట్లలో వస్తున్న వార్తలపై చిరు టీమ్ వివరణ ఇచ్చింది. ఇంతకీ ఆ అరుదైన గౌరవం ఏమిటంటే, చిరంజీవి యుకె సిటిషన్ షిప్‌ని తీసుకుంటున్నారట. యుకె గవర్నమెంట్ ఇచ్చిన ఈ గౌరవాన్ని చిరు స్వీకరించబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతుండటంతో చిరు టీమ్ అలెర్ట్ అయింది. 

అసలే ఈ మధ్య చిరంజీవిపై సోషల్ మీడియాలో ఎలా పడితే అలా నెగిటివ్ వార్తలు, పోస్ట్‌లు చేస్తూ వైరల్ చేసే టీమ్ ఎక్కువైంది. ఆయన సరదాగా అన్నమాటని కూడా పట్టించుకుని, అదేదో పెద్ద, ఘోరమైన తప్పిదంగా చూపించేందుకు ఓ పార్టీ వర్గాలు, యాంటీ ఫ్యాన్స్ పనిగట్టుకుని మరీ కూర్చుంటున్నారు. అలాంటి వారు వైరల్ చేసే వార్తలు ఎక్కడ నిజమని అంతా అనుకుంటారో అని, వెంటనే చిరంజీవి టీమ్ వివరణ ఇస్తూ, అవన్నీ రూమర్స్‌గా కొట్టిపారేశారు. 

చిరంజీవిని సన్మానించేందుకు యుకెలో ఓ కార్యక్రమం జరగాల్సి ఉందట. దానిని దృష్టిలో పెట్టుకుని అంతా లేనిపోని వార్తలను వైరల్ చేస్తున్నారు. ఈ వార్తలతో ఆ వేడుకకు కూడా చిరు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి దుబాయ్ టూర్ ముగించుకుని, విశ్వంభర సాంగ్స్ షూట్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు.

Chiranjeevi UK Citizenship Rumors: Team Clarifies the Truth:

Chiranjeevi Alleged UK Citizenship Honor: Team Denies Viral Claims

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ