రీసెంట్‌గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది, అందులో మీనూగా చేసిన మీనాక్షి చౌదరి. అంతకు ముందు లక్కీ భాస్కర్‌తోనూ ఈ భామ హించి హిట్‌నే సొంతం చేసుకుంది. మొత్తానికి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ భామకు ఇప్పుడు ఊహించని ఛాన్స్ వరించింది. అవును, ఈ విషయం తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు కూడా.
ఏమా ఛాన్స్ అనుకుంటున్నారా? మీనాక్షి పాపను ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది ఏపీ ప్రభుత్వం. రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8వ తేదీన ఈ విషయాన్ని అధికారికంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించనుందని తెలుస్తోంది. నిజంగా ఈ అవకాశం మీనాక్షి కూడా ఊహించి ఉండదు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళుతోన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే మీనాక్షి పేరే వినబడుతుంది. మీనాక్షి స్పీడ్‌కి తట్టుకోలేక పూజా హెగ్డే సైతం టాలీవుడ్ వదిలేసింది అంటే, మీనూ పాప క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మీనాక్షి చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి.