త్రినాథరావు నక్కిన తన తదుపరి ప్రాజెక్ట్ కోసం మరో యంగ్ హీరోని సెట్ చేసినట్లుగా తెలుస్తుంది. ధమాకా వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన యంగ్ హీరో సందీప్ కిషన్‌తో మజాకా అనే ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెట్టేశాడీ ధమాకా డైరెక్టర్. ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. నువ్విలా, జీనియస్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ కోనేరు.
త్రినాథరావు, హవీష్ కాంబోకు ఓ హై ఎనర్జీ ఎంటర్‌టైనర్‌ని, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ స్టోరీని రైటర్ బెజవాడ ప్రసన్న రెడీ చేశాడని, ప్రస్తుతం ఫార్మల్ షూట్ కూడా మొదలైందని తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, ఆల్రెడీ షూటింగ్ ప్రాసెస్ కూడా నడుస్తుందనేది లేటెస్ట్ అప్డేట్. మంచి సమయం చూసుకుని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారట.
హవీష్ కోనేరు నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ఆ మధ్య వరుసగా సినిమాలను అనౌన్స్ చేసిన ఆయన ఎందుకు గ్యాప్ తీసుకున్నారనేది తెలియలేదు. గ్యాప్ తీసుకున్నా, ఈసారి బంపర్ హిట్ కొట్టాలనే, ఈ సినిమాను ఓకే చేశాడనేలా టాక్ నడుస్తుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.