Advertisementt

ఏంటి రాజా ఈ డ్రామాలు

Sun 02nd Mar 2025 04:37 PM
posani drama  ఏంటి రాజా ఈ డ్రామాలు
Posani Drama Continues After Arrest ఏంటి రాజా ఈ డ్రామాలు
Advertisement
Ads by CJ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మినిస్టర్ నారా లోకేష్‌‌లను నోటి కొచ్చినట్లుగా తిట్టడంతో పోసానిపై కేసు నమోదవ్వడం, పోలీసులు అరెస్ట్ చేయడం వంటివి చకాచకా కాకపోయినా, కాస్త ఆలస్యంగానైనా జరిగాయి. అరెస్ట్ అనంతరం కూడా పోసాని తన వేషాలు తగ్గించడం లేదు. జైళ్ల అధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. 

శనివారం అనారోగ్యంగా ఉందని, ఛాతి నొప్పి అంటూ కంగారు పెట్టడంతో, వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. అనంతరం మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ హాస్పిటల్‌లోకి తరలించి, అక్కడ కూడా అనేక పరీక్షలు నిర్వహించారు. 

అయితే ఎక్కడా కూడా పోసానికి అనారోగ్యం ఉన్నట్లుగా డాక్టర్లు చెప్పలేదు. ఉదయం ములాఖత్‌లో పోసానిని రాజంపేట వైఎస్ఆర్‌పీపీ పార్టీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి పరామర్శించారు. ఆయన పరామర్శ అయిన కాసేపటికే పోసాని డ్రామా స్టార్ట్ చేయడంతో.. అంతా ఏంటి రాజా? ఇదంతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Posani Drama Continues After Arrest:

After Arrest, Posani Stir Continues: Health Concerns or Another Performance

Tags:   POSANI DRAMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ