Advertisementt

రిలీజైన 14 రోజుల్లోనే ఓటీటీలోకి

Sun 02nd Mar 2025 04:14 PM
bapu ott  రిలీజైన 14 రోజుల్లోనే ఓటీటీలోకి
Bapu OTT Release Date Announced రిలీజైన 14 రోజుల్లోనే ఓటీటీలోకి
Advertisement
Ads by CJ

బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన బాపు సినిమా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ తేదీ, వేదిక వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

బ్రహ్మాజీ కొంత విరామం తర్వాత కథానాయకుడిగా నటించిన చిత్రం బాపు. ఈ సినిమాకు ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ అనే ఉపశీర్షికను పెట్టారు. అంటే ఓ తండ్రి జీవితంలోని కొన్ని సంఘటనలను ఆవిష్కరించే కథ ఇది. థియేటర్లలో విడుదలై రెండు వారాలు కూడా పూర్తికాక ముందే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని నిర్మాతలు ప్రకటించారు.

బాపు సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. మార్చి 7న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. దీంతో థియేటర్లలో రిలీజ్ అయిన 14 రోజులకే సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. కానీ కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. బ్రహ్మాజీ ఈ సినిమాపై తన అభిప్రాయం తెలియజేస్తూ, కథ నచ్చి రూపాయి కూడా తీసుకోకుండా నటించానని వెల్లడించారు. ఇలాంటి కథలను ప్రేక్షకులు థియేటర్లలో ఆదరించడం చాలా అవసరమని అన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి ఆమని, బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. 

దయా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. మరి థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టలేకపోయినప్పటికీ, ఓటీటీలో ఈ సినిమా మంచి స్పందన రాబట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

Bapu OTT Release Date Announced:

Bapu Streaming on JioCinema from March 7  

Tags:   BAPU OTT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ